పుస్తకపాణీ శతకము, విభక్తి ప్రపత్తి ఉదాహరణకావ్యం పుస్తకాల ఆవిష్కరణ

                                       

దర్శనమ్ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో

మరుమాముల దత్తాత్రేయ శర్మ రచించిన పుస్తక పాణీ శతకము, విభక్తి ప్రపత్తి ఉదాహరణ కావ్యం పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం ఈరోజు
(15-06-2020,సోమవారం సాయంత్రం), శ్రీ శంకరమఠం,నల్లకుంట, హైదరాబాద్ లో సాయంత్రం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అతిథులను
దర్శనమ్ సంపాదకులు మరుమాముల వేంకట రమణ శర్మ వేదికపై కి ఆహ్వానించారు. పరమహంస పరివ్రాజకులు, శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ మాధవానందసరస్వతీ స్వామివారు ,ముఖ్యఅతిథి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి గారు,సభాధ్యక్షులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారలు జ్యోతిప్రకాశనం చేసి సభను ఆరంభించారు. శ్రీ విఎస్ ఆర్ మూర్తి గారు,డా.కేవీ రమణాచారి గారు డా.బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారలు పుస్తక పాణీ శతకము, విభక్తి ప్రపత్తి పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారు అనుగ్రహాభాషణం చేసారు. దత్తాత్రేయ శర్మ పుస్తకాలను స్వామివారికి అంకితం చేశారు. విశిష్ట అతిథులు..శతావధాని డా.శ్రీ జీ ఎం రామశర్మ ,సాహితీవేత్తలు,డా.శ్రీ ఆచార్య ఫణీంద్ర,డా.శ్రీ సంగనభట్ల నరసయ్య, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శ్రీ శాస్త్రుల వేంకటేశ్వర శర్మ, శ్రీమతి లాలితావాణి గారలు ప్రసంగించి పుస్తకాలను సమీక్షించారు.చివరగా
శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ ప్రసంగించారు.

Comments

Popular posts from this blog

శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి పదవివిరమణ సందర్బంగా వారికీ శుభాభినందనలు

పీవీ జీవితంలో చ‌ద‌వ‌ని పేజీ ...